Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన వారి గురించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు  – పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ 

సిద్దిపేట జిల్లా మార్కూక్ మండల సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఏడుగురు యువకులలో ఐదుగురు గల్లంతు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వారు సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులుగా గుర్తింపు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఐపీఎస్ సంఘటన జరిగిన విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి అధికారులకు తగు సూచనలు సలహాలు చేస్తూ గజ ఈతగాళ్ల సహాయంతో గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది మృతదేహాలను తీయడంలో గజ ఈతగాళ్లకు సలహాలు సూచనలు చేస్తూ సహకరించడం వల్ల మృతదేహాలను కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో నుండి తీయడం జరిగింది. ఐదు మృతదేహాలను మరణాన్ని గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం చేయించడం జరుగుతుంది. పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Related posts

నేషనల్ హైవే పై సన్న కంకర తొలగించడంలో నిర్లక్ష్యం

Harish Hs

మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

ఉట్కూరు నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి 

TNR NEWS

అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

Harish Hs

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs

కార్యనిర్వాహణ అధికారిగా కే.వినోద్ బాధ్యతలు

TNR NEWS