హరిహర సుతుడు అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ మణికంఠ పూజ స్టోర్స్ నిర్వాహకులు మని. నాగేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మదిన వేడుకలకు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. స్వామి వారి కార్యక్రమలను కనుల పండువగ నిర్వహిస్తున్న మణికంఠ పూజ స్టోర్స్ నిర్వాహకులు మని. నాగేందర్ ను ఈ సందర్భంగా పలువురు అయ్యప్ప భక్తులు అభినందించారు. అనంతరం భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు………

previous post