పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి మండలంలోని, చీమలపేట గ్రామంలోని కుర్మపల్లి లో మరియు బస్టాండ్ వద్ద యంగ్ స్టార్ యూత్ సభ్యులు ఇరువురు నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు రఘువీర్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ.. చీమల పేట గ్రామంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం అత్యంత గొప్పగా అధిక సంఖ్యలో మహిళలు హాజరై కన్నుల పండగగా కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా చీమలపేట ఆడబిడ్డలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో విజయం సాధించిన వారికి ప్రత్యేక బహుమతులను అందజేయడమే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతిని అందించడం జరిగింది. వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన రఘువీర్ సింగ్ ను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొంటి బుచ్చయ్య, తొంటి రాజశం, తొంటి బుచ్చయ్య, తొంటి మధుకర్, యంగ్ స్టార్ యూత్ సభ్యులు ముత్యాలు స్వామి, లంక తిరుపతి, కాల్వల రాజేశం, రానవేణి సంపత్, ఉత్తర్ల నారాయణ, ఉత్తర్ల సంపత్, యాదగిరి కనుకయ్య, ముత్యాల రవి, ఉత్తర్ల రాజేషం, పెద్దపల్లి సంపత్, లంక గోవర్ధన్, కాల్వల కుమారస్వామి, ముత్యాల చందు తదితరులు పాల్గొన్నారు.