తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారు గుండ్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన మంగళవారం తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సైకాలజిస్టుల సమావేశంలో రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ,ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు చదువు ఏకాగ్రతలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని రాజశేఖర్ తెలిపారు.
previous post
next post