: రాయికల్ పట్టణంలోని 10వ వార్డులో గల అంబేద్కర్ యువసేన యూత్, అంబేద్కర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో మారంపెల్లి రాము, లింగంపెల్లి సుభాష్, నిగ చిన్నగంగారాజం, అంతడ్పుల రాజయ్య, గంగారాజం,బాపురపు రాజీవ్, లక్ష్మీనర్సయ్య, గంగాధర్, రవి, స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.