కోదాడకు సమీపంలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల అనాధాశ్రమానికి కోదాడ పట్టణానికి చెందిన వీరేపల్లి వెంకట సుబ్బారావు వారి సతీమణి రుక్మిణమ్మ జ్ఞాపకార్థంగా లక్ష రూపాయల విరాళంను కోదాడలోని వారి నివాసంలో సంస్థ నిర్వాహకులు శనగల జగన్మోహన్ కు అందజేశారు. అమెరికాలో స్థిరపడిన వారి కుమారుడు వీరేపల్లి వెంకటేశ్వరరావు సతీమణి స్మిత తో కలిసి కోదాడ కు వచ్చిన సందర్భంగా ఈరోజు దివ్యాంగుల అనాధాశ్రమాన్ని సందర్శించి అనాధలను మానసిక దివ్యాంగులను చేర దీసి ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులు శనగల జగన్మోహన్ ను వారు ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగులకు, సంస్థకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు……..