Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న నేటికి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందర్ రావు, పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి అన్నారు. బుధవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నేటికీ 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు రావాల్సిన 7200 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించడం అంటే పేద విద్యార్థుల పట్ల ఏ విధమైన ప్రేమ ఉందో అర్థం అవుతుందని వారన్నారు. విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ ఎత్తివేయాలని కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుతామని హెచ్చరించారు. గత నెలలో అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం అందాల పోటీలకు ఏ విధంగా ఖర్చు పెట్టిందని ప్రశ్నించారు. విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి రాఖి, డివిజన్ నాయకులు ఉమేష్, పరమేష్, అలేఖ్య, సంధ్య, రమ్య, సాహితి, సులోచన, మంజుల, తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

TNR NEWS

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

Harish Hs

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs

పెదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ…

TNR NEWS

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన.. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

TNR NEWS

లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్ర వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

TNR NEWS