February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన అనుచరులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని రోజులుగా దావోస్ తదితర విదేశాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం సమకూర్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కృషిచేసిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..

Related posts

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS

కాశిబుగ్గ వివేకానంద కాలనీలో పారిశుద్ధ పనులు 

TNR NEWS

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఫిష్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

TNR NEWS

పద్మశాలి ఐక్యవేదిక జిల్లా కమిటీ లో కోదాడ వాసుల నియామకం

Harish Hs