తెలంగాణ పద్మశాలి చేనేత ఐక్యవేదిక జిల్లా కమిటీలో కోదాడ వాసులు నియామకం అయ్యారు. పద్మశాలి సేవా సంఘానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరా మోహన్ చేతుల మీదగా కోదాడ కు చెందిన గొర్రె రాజేష్ సూర్యాపేట జిల్లా ప్రచార కార్యదర్శిగా, పిచుకల కోటయ్య జిల్లా సహాయ కార్యదర్శిగా,నక్క చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులుగా నియామకం పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీలో నియామకమైన వారిని పద్మశాలి సేవా సంఘం నాయకులు గోలి నాగరాజు, సంగిశెట్టి గోపాల్, చిట్టిప్రోలు గిరిప్రసాద్, గొర్రె సత్యనారాయణ లు అభినందించారు………..
previous post