గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి సిబ్బంది అందరిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 సవరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మునగాల మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం ఎల్ నాగార్జున అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ తెలంగాణ గ్రామపంచాయతీ సిబ్బంది లందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 ని సవరించి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయితీ సిబ్బంది నందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్, ఈఎస్ఐ,పిఎఫ్, సౌకర్యం కల్పించాలని కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.
ఈ కార్యక్రమంలో ఎల్ నాగార్జున, ఎం ఎంకన్న, ఎం ముత్తయ్య, పరుశురాములు, రాజు, సీతారాములు, సైదులు, నాగరాజు, వీరయ్య, రఘు, టీ ముత్తయ్య, సాగర్, తదితరులు పాల్గొన్నారు