రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ చట్ట సభల్లో బిల్లు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటుచేసిన ముఖ్యనాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల కాలంగా వర్గీకరణకై ఎన్నో పోరాటాలు చేశామని సుప్రీంకోర్టు తీర్పు మేరకు మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ దామోదర రాజనర్సింహ లతో పాటు ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ, మేడి పాపయ్య మాదిగలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాజికంగా విద్యా పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన పంబాల, మన్నే కులాలను క్యాటగిరి ఏ నుంచి తొలగించి సీ కేటగిరీలో చేర్చాలని బలహీనులుగా ఉన్న బుడగజంగాలు, డక్కలి కులాలను ఏ క్యాటగిరిలో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి, నారకట్ల ప్రసాద్, చిలుకూరు మండల అధ్యక్షులు బొల్లె పోగు కాశయ్య, పిడమర్తి బాబురావు, సోమపొంగు శ్రీను, ఏర్పుల చిన్ని, చంటి తదితరులు పాల్గొన్నారు……

previous post
next post