ఆత్మకూర్ మండలంలోని నీరుకుల్లా గ్రామంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ మాట్లాడుతూ ఆదివారం రోజున నీరుకుల గ్రామంలో ఎస్ సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల కమిటీ సమావేశం జరుగుచున్నది మండలంలోని మాల కుల సంఘ సభ్యులందరూ పాల్గొని భవిష్యత్తులో జరగబోయే ఎజెండా గురించి చర్చించి ఎస్సీ వర్గీకరణను అడ్డుకొని ఎస్సీల అభివృద్ధి కోసం వారి హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ దండు రాజు మాల మహానాడు సీనియర్ నాయకులు పసుల లక్ష్మీనారాయణ వంగేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు