చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని కొనగట్టు శివాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రహోమం నిర్వహించారు. ఈ రుద్రహోమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, సీనియర్ పాత్రికేయులు ఈనాడు రాజశేఖర్ రెడ్డి, వెలుగు రాజేష్ మరియు పలువురు దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాత్రికి నిర్వహించే భజన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ మరియు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ రుద్రహోమం, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.