కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
తూమాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుడిబండ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి సలీమ్ తో సహా పలువురు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారి మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పులి తిరుపతి బాబు ,పులి చలమయ్య, సురరపు వంశీ, పులి కేసు బాబు, పెడమర్తి బాబు, కందుకూరి ఉపేందర్, నవ్వరపు రమేష్, మందుల నరసయ్య, నూకపంగు లాజర్, పులి శ్రీను, పులి వెంకటి, ఎలమర్తి వంశీ, పులి రోశయ్య, పులి ప్రవీణ్, పులి రవీందర్, కష్టాల దిలీప్, ఎలమర్తి శ్రీను, నూకపంగ్ మహేష్, గడ్డం ఉపేందర్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కుక్కడపు నాగరాజు, ఇర్ల నరోత్తమ రెడ్డి, చింత సత్యనారాయణ రెడ్డి, కుకడపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు…..