గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి కోదాడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) ఏజెంట్ల సమైక్య అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు సహా ఎంతో భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థులు మరణించడం బాధాకరమని రెండు నిమిషాలు మౌనం పాటించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సొందిమియా, ఏడియం సంజీవయ్య, ఏబీఎమ్ రాము, పోతుగంటి వెంకటాద్రి, ప్రభాకర్ రెడ్డి, సుబ్రమణ్యం, అహమ్మద్ అలీ, వీరారెడ్డి, రాజశేఖర్, అమర్ సింగ్, విజయ శంకర్, కన్నయ్య, సైదా, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు……..

next post