Tnrnews.in
తెలంగాణ

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

విద్యార్థుల సృజనాత్మకత, మేధాశక్తికి ప్రతిరూపంగా విద్యా ప్రదర్శనలు నిలుస్తున్నాయని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయంలో సైన్స్ ఫెస్ట్ ‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు..ఆలోచనలు భిన్నంగా ఉంటే ఆ విష్కరణలు సైతం భిన్నంగా ఉంటాయని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచుతాయని అన్నారు.మనం అనుభవిస్తున్న విజ్ఞాన పలాలు ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి శ్రమ పలితమని అన్నారు.సైన్స్ కు మన జీవితంతో విడదీయరాని సంబంధం ఉందని, ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని రకాల సౌలభ్యాలు,సౌకర్యాలు సైన్స్ వల్లనేనని,అందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు మనం రుణపడి ఉన్నామని, విద్యార్థులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడే,సమాజంలోని మూఢత్వాన్ని తొలగించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్, పాఠశాల చైర్మన్ ఉషారాణి, ఏవో ప్రభాకర్ రెడ్డి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లిం యువకులు

TNR NEWS

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి – గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక చర్యలు – ప్రతిపక్షాలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయొద్దు – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

TNR NEWS

*మాలల సింహ గర్జన.. ఐక్యత కోసం.. హక్కుల కోసం: ఎమ్మెల్యే వివేక్..!!*

TNR NEWS

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS

ఉపాధి హామీ సోషల్ అడిట్ ఇంటింటి సర్వే పాల్గొని పరిశీలిస్తున్న డి.ఆర్.పి రేచల్

TNR NEWS