కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధమైన ఘటన నిజాంసాగర్ మండలం లోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఎలక్ట్రిక్ బోర్డు లో ఒక్కసారిగా షర్ట్ సర్క్యూట్ కావడంతో షాప్ మొత్తం మంటలు అలుముకొని ప్రింటర్, కంప్యూటర్, మీ సేవలో పత్రాలు మిగతా సామాగ్రి అన్ని కూడా పూర్తిగా కాలిపోయింది. మొత్తం రూ.1 లక్ష 50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. మీసేవ మీద ఆధారపడిన బాధితుడు షాప్ కాలిపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డానని ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలని ఆయన కోరారు.