ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్ర భాగాన నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ పదవుల నియామకం కొరకు ఆర్యవైశ్య సంఘం కోదాడ పట్టణ అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామ, మండల స్థాయిలో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కొరకు చురుకుగా పని చేసే వారిని జిల్లా కార్యవర్గంలో చోటు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కార్యవర్గాన్ని పూర్తి చేసుకొని త్వరలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కమిటీ చేత ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘ అభివృద్ధి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గంలో ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు, కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, సంయుక్త కార్యదర్శి అశోక్, యూత్ అధ్యక్షుడు బొమ్మిడి అశోక్, మాజీ అధ్యక్షుడు అనంత రాములు, మాజీ కార్యదర్శి బండారు రాజా, కుక్కడపు బాబు, సత్యనారాయణ, జగని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు………..

previous post