పిఠాపురం : రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదు జనాలకి. అటువంటి జనాలు నేడు కోడి మాంసం తినడం మానేయడంతో చికెన్ వ్యాపారస్తులు నష్టపోతున్నారని వారికి మద్దతుగా నిలిచేందుకు పలు చికెన్ కంపెనీలు ముందుకు వచ్చి పలు రకాల స్టాల్స్ ఏర్పాటుచేసి జనాలను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ళకు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ తినడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని తునికి చెందిన వేంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వెంకబ్ చికెన్ సంయుక్తంగా ఉచిత చికెన్ మేళా స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా బ్రాంచ్ మేనేజర్ దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన ప్రకారం 70డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో గుడ్లు, కోడి మాంసం ఉండటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని, అది తినడం వల్ల ప్రజలకు ఎటువంటి హానీ జరగదన్నారు. పిఠాపురం పట్టణంలో సుమారు 2000 మందికి పైగా చికెన్, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.