కాకినాడ : నగరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాల నిర్వహణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 14వేల నుండి 19వేల వరకు వుండగా నగర పాలక సంస్థ రాబడిలో ట్రేడ్ లైసెన్స్ రాబడిలో 7వేలకే పరిమితం కావడం దివాళాకోరుతనంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఏటా రూ.3కోట్ల రూపాయల మేరకు వుండాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఆదాయం కేవలం రూ.90 లక్షలకు పరిమితం కావడం దురదృష్టకరంగా వుందన్నారు. ఈట్ స్ట్రీట్ నిర్వహణలో ట్రేడ్ లైసెన్స్ నిర్వహణ లేకుండా జరుగుతున్న తతంగంగానే 7వేల ఖాతాలకు ఫీజుల వసూలు లేకుండా పక్కదారి పడుతున్న నేపథ్యంలో కార్పోరేషన్ ఆదాయం పూర్తిగా నష్టపోతున్నదన్నారు. కార్పోరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారి బదిలీ, తనిఖీలు, రోజువారీ విచారణ చర్యలు కార్పోరేషన్ ఖజానాకు ఆదాయప్రాతిపదిక టార్గెట్ లేకపోవడం వలన ఇష్టారాజ్యంగా చిల్లర మాఫీయా నీడలో నిర్వహణ జరగడం వలన ట్రేడ్ లైసెన్స్ దళారీ వ్యవస్థగా మారిపోయిందన్నా రు. మున్సిపల్ చట్ట ప్రకారంగా కార్పోరేషన్ ఆదాయాన్ని వసూళ్లు చేసే ప్రక్రియలో హెల్త్ విభాగం చర్యలు నామ మాత్రంగా వుండటం పట్ల ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ చర్యలు తీసుకోవాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.