త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. ఆయనకు భక్తులెక్కువ. ఆ కోవకే పరమ శివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన జన్మించడంతోనే ఆతడు శివభక్తుడు. ఓ వైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే.. మరోవైపు మహేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవారు. దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. గుడి చుట్టు ప్రదక్షణ అయిన తర్వాత… భక్తుడు నందీశ్వరుడికి దణ్ణం పెట్టుకుంటాడు. అనంతరం నందీశ్వరుడి కొమ్ములపై చేతి వేళ్లు ఉంచి.. ఆ మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకుంటాడు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. అలాగే శివాలయాల్లోనే నందీశ్వరుడు ఉంటాడు. మిగిలిన దేవాలయాల్లో ఉండడు. ఓ వేళ ఉన్నా.. స్వామి వారికి ఎదురుగా ఉండడు ఇలా ఎందుకు అనే సందేహం పలువురు భక్తుల్లో వ్యక్తమవుతోంది. త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. ఆయనకు భక్తులెక్కువ. ఆ కోవకే పరమ శివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన జన్మించడంతోనే ఆతడు శివభక్తుడు. ఓ వైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే.. మరోవైపు మహేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవారు. అలా ఓ సారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు. అతడి తపోదీక్షకు మెచ్చిన కైలాసనాథుడు ప్రత్యక్షమై.. వరం కోరుకోమన్నాడు. పది వేల ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించాలంటూ పరమ శివుడిని కోరాడు. అలాగేనంటూ నందీశ్వరుడికి ఈశ్వరుడు వరమిచ్చాడు. అలా తపస్సు పూర్తి చేశాక.. నందికి ఈశ్వరుడు గణాధిపత్యం ప్రసాదించాడు. దీంతో అతడికి అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. దీంతో శ్రీశైలంలోనే కొలువు తీరేలా పరమ శివుడు అనుగ్రహించాడు. ఈ వృత్తాంతం శ్రీశైల ఖండంలో స్పష్టం చేశారు.
అందుకే నంది కొమ్ముల మధ్య నుంచి పరమ శివుడిని దర్శిస్తారు
శివాలయంలో పరమశివుడి ఎదుట ఉండే నంది ధర్మ స్వరూపం.ఈ నంది నాలుగు పాదాలు.. చతుర్వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తుందనటానికి నిదర్శనంగా.. నంది ముందర కుడిపాదం పైకి లేచి ఉంటుంది. మిగిలిన మూడూ పాదాలు లోపలికి మడిచి ఉన్నట్లు కనిపిస్తాయి. ఇక సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోష కాలమని పేర్కొంటారు. ఈ సమయంలో నందిశ్వరుడికి విశేష అర్చనలు, పూజలు చేయడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే, ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూసేందుకు దేవతలు భయపడ్డారు. ఈ నేపథ్యంలో నందీశ్వరుడి వెనుక నిలబడి కొమ్ముల మధ్యలోంచి శివుడిను దర్శించారని పురాణాల కథనం. నేటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. భక్తులు నంది కొమ్ముల మధ్యలోంచే స్వామిని దర్శించడం సంప్రదాయంగా వస్తోంది.