Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైములను పరిష్కరించాలి.  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు

మోతే : పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉండటం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దారి మళ్లించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే నేరుగా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట భవన నిర్మాణ కార్మిక సంఘం మండలం ఉపాధ్యక్షులు గట్టు శ్రీను, నాయకులు షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్…

TNR NEWS

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు జీవించిన బచ్చలకూరి జార్జి

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

ఎండలు పెరుగుతాయ్జా గ్రత్తగా ఉండాలి

TNR NEWS

ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్

Harish Hs

వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._   _కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._  వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._  _తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి._ నాగయ్య డిమాండ్

TNR NEWS