Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం

  • స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో ‘232’వ సంకష్టహారచతుర్థి ఉత్సవం

కాకినాడ : కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో 232వ సంకష్టహారచతుర్థి సందర్భంగా ఉచ్చిష్ట గణపతికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60మంది చైత్రమాస చతుర్థి ఉపవాసకులతో సుప్రభాతవేళ  పీఠం మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరిగింది. తెల్ల జిల్లేడు పుష్పాల పాలవెల్లితో, సహస్ర నామ పారాయణ, లక్ష వత్తులతో దీపారాధన, పంచామృతాలతో అభిషేకం, చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసకులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక తాంబూలాలతో అల్పాహారం అందించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తెల్ల జిల్లేడు పుష్పాలతో క్రిష్ణపక్ష చతుర్థి వేళ గణేశునికి అర్చన చేయడం వలన కడిగినముత్యం వలె ప్రారబ్ధ కర్మలు పరిహారమవుతాయన్నారు. కాలజ్ఞాన స్వరూపంగా భోగియజ్ఞంలో నిలిపిన శతాధిక వత్సరాల రావి మాను దుంగ నుండి స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలిసిన విఘ్నేశ్వర స్వరూపాన్ని పరిరక్షించేందుకు పంచ లోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్బంగా గత ఏడాది నుండి ఉపవాసకులతో ప్రత్యేకంగా జరుగుతున్న సామూహిక చతుర్థిమాసోత్సవాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ చతుర్థివరకు జరుగుతాయన్నారు.

Related posts

నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్‌  – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన

TNR NEWS

జనసేన పార్టీలోకి వైసిపి సర్పంచ్ దొడ్డి ప్రసాద్

Dr Suneelkumar Yandra

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

Dr Suneelkumar Yandra