కాకినాడ : ఆర్థిక మాంద్యం కారణంగా కాకినాడ నగరంలో రోజు రోజుకీ పౌరసౌకర్యాల నిర్వహణ కుంటుపడిపోతున్న దుస్థితి తీవ్రతరంగా వుందని, ఇందుకు కమీషనర్ మాత్రమే బాధ్యత వహించలేరని ప్రభుత్వం కార్పోరేషన్ బకాయిలు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు విడుదల చేస్తే కార్పోరేషన్ పని తీరు మెరుగయ్యే అవకాశం వుంటుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. నగరంలో 50శాతం వీధి దీపాలు వెలగడం లేదన్నారు. నెలకు రూ.30లు వసూలు చేసినా రోజులు మూడు పూటలా మూడు బట్టల్లో చెత్తలను వేరు చేసి సేకరించి పట్టుకెళ్ళే వారని ప్రస్తుతం రోజుకు ఒకసారి మాత్రమే ప్రధాన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్నదన్నారు. లోపలి ప్రాంతాల్లో డ్రెయిన్లు కాలువలు నిర్వహణ 50శాతం మృగ్యమయ్యిందన్నారు. వీధి కుక్కల బెడద అధికంగా వుందన్నారు. రోడ్ డివైడర్స్ లో పచ్చదనం కరువయ్యిందన్నారు. నగర వ్యాప్తంగా రైల్వే పట్టాల పొడవునా చెత్తలు చేరిపోతున్నాయన్నారు. బ్రిడ్జిల దిగువ కానులు, మినీ డంపింగ్ యార్డ్స్ గా మారాయన్నారు. వీధి కల్వర్టులు శిథిలమయ్యి కృంగిపోయిన జంక్షన్ లు అనేకంగా ఉన్నాయన్నారు. వేసవి ఎండల్లో వర్షాలు కురిస్తే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే దుస్థితి వుందన్నారు. కాలువల్లో పూడికలు తీయించిన దాఖలాలు లేవన్నారు. ప్రతి రహదారిలోనూ ఆవులు ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్స్ గా వున్న మందలను నివారించే పరిస్థితిలేదన్నారు. పార్కుల్లో క్రీడా పరికరాలు పూర్తిగా దెబ్బతిని పోయి ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంస్థల్ల ఆవరణలు కాలేజీ గ్రౌండ్స్ చెత్తలను దగ్ధం చేయడం వలన ఏర్పడుతున్న వాయు కాలుష్యం నివారించే పనులు జరగడంలేదన్నారు. కార్పోరేషన్ లో కమీషనర్ తో బాటుగా ఇంజనీరింగ్ ప్రజారోగ్యం సిటీ ప్లానింగ్ రెవిన్యూ అధికారులు సమన్వయంగా పని చేస్తున్న తీరు లేదన్నారు. మున్సిపల్ మంత్రి వచ్చిన సమయంలో తూతూ మంత్రంగా ప్రకటనలు వెలువడటం మినహా చట్టసభల ప్రతినిధులు కార్పోరేషన్ నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టడం లేదన్నారు. ప్రత్యేక అధికారి అఖిల పక్షం నిర్వహిస్తామని ప్రకటించి ఆరు నెలలు దాటినా ఎటువంటి కార్యాచరణ లేదన్నారు. జిల్లా మంత్రి జిల్లా కేంద్రం గురించి పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మున్సిపల్ మంత్రి కావడం వలన అమరావతి మంత్రిగా సమయం సరిపోక కాకినాడ నగరీకరణ విషయంలో ఎంత మాత్రం శ్రద్ధ చేయడానికి సమయం సరిపోవడం లేదన్నారు. మూడేళ్లుగా స్థానిక ఎన్నికలు లేకుండా ఆర్థిక సంఘం నిధులు రాకుండా కోట్ల రూపాయల్లో బకాయి పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్ను కుళాయి పన్ను రాబడి లేకపోవడం వలన కార్పోరేషన్ ఆదాయ వనరుల పెంపు చేయకపోవడం వలన నెలవారీ సమీక్షకు తావులేక పోవడం వలన గుట్టు చప్పుడుగా బడ్జెట్ ప్రవేశపెట్టి బహిరంగం చేయకపోవడం వలన కాకినాడ కార్పోరేషన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారయ్యిందన్నారు. కార్పోరేషన్ ఖజానా గుల్ల చేసి ప్రయివేటు ఆదాయాలతో స్వంత సంపద పెంచుకుంటున్న ధోరణి ఎక్కువయ్యిందన్నారు. కార్పోరేషన్ ఆస్తులు అప్పులు ఆదాయాలు ప్రభుత్వ నిధులు గ్రాంట్లు నికరంగా ప్రకటించాలని అఖిల పక్షం సమావేశం నిర్వహించాలని పౌర సంఘం డిమాండ్ చేసింది.

previous post