Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

21న పిఠాపురం కు సిపిఐ రాష్ట్ర నేత కే రామకృష్ణ రాక

  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరాటం ఆగదు

 

  • పాత్రికేయ మిత్రులకు పిఠాపురంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

 

  • ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు

 

పిఠాపురం : గ్రామీణ ప్రాంతాల అర్హులైన పేదలకు మూడు సెంట్లు భూమి దక్కేవరకు సిపిఐ పోరాటం ఆగదని అందులో భాగంగా ఈనెల 21 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద జరిగే ధర్నాకు వస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. మధు మాట్లాడుతూ యు.కొత్తపల్లి మండలం కొమరగిరి పేజ్ టూలో 72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దీనిని కొంతమంది భూకబ్జాదారులు 31 ఎకరాలను అక్రమంగా సాగు చేస్తున్నారని, మరో 41 ఎకరాలు కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన విమర్శించారు . ఈ ప్రభుత్వ భూములను కాపాడవలసిన రెవిన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల వద్ద నుండి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల దరఖాస్తులు వ్రాసామని వారందరూ దరఖాస్తు తీసుకుని ఈ నెల 21న శుక్రవారం ఉదయం 10 గంటలకు కొమరగిరి జంక్షన్ కు చేరుకోవాలని, అక్కడి నుండి ర్యాలీగా యు.కొత్తపల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు చేరుకుంటామని అక్కడ దరఖాస్తులు ఎమ్మార్వో కు ఇస్తామని మధు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు

జి .కోటేశ్వరరావు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం అ భూమిలో పేదలందరికీ మూడు సెంట్లు భూమి తక్షణమే ఇచ్చి ఐదు లక్షల రూపాయల రుణ సాయంతో ఇల్లు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె.బాడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ.భవాని తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి

Dr Suneelkumar Yandra

విజయవంతంగా ముగిసిన పిఠాపురం మండల గ్రామముల ఆవిర్భావ సభ సన్నాహక సమావేశములు

Dr Suneelkumar Yandra

పాదగయా క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తాం – ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్

Dr Suneelkumar Yandra

నీ ఆలోచనే – నీ విజయం

Dr Suneelkumar Yandra

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

అడవి బిడ్డలకు అండగా కూటమి ప్రభుత్వం