మునగాల మండలంలోని నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. అనురాధ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అదేవిధంగా ఎంత ఎత్తుకు ఎదిగినా,ఒదిగి ఉండాలని, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.పాఠశాలల్లో వివిధ తరగతుల వారిచే సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కలెక్టర్ ఎగ్జామినేషన్ కిట్ మరియు హాల్ టికెట్ లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.