Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

కోదాడ పట్టణంలో గ్రామ దేవత నాభి శిల బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం శుక్రవారం కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలని కనుల పండువగ జరిపారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బిందెలతో జలాభిషేకాలు జరిపి బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు,శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చొని బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి జలాభిషేకాలు జరిపి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. పట్టణ నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో బొడ్రాయి వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ సభ్యులు, ముత్యాలమ్మ కమిటీ, రైతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు……….

Related posts

గురుకుల పాఠశాల లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము  సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వర్ రావు 

TNR NEWS

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

Harish Hs

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి… ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి….

TNR NEWS

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల

TNR NEWS