Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన-రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతి ఒక్కరికి 6 కేజీ ల సన్నబియ్యం పంపిణి చేసేందుకు ఉగాది (మార్చి 30) రోజు హుజూర్ నగర్ పట్టణంకు విచ్చేస్తున్న సందర్బంగా గురువారం సభ ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహన్,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సభకి వచ్చే ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీడ ఉండేలా హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలని, త్రాగు నీరు, చల్లని త్రాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికంగా వాహనాలు వస్తాయి కాబట్టి ట్రాఫిక్ ని నియంత్రించాలని పార్కింగ్ స్థలాలకి ఆప్రోచ్ రోడ్లు రేపటిలోగా పూర్తి చేయాలని తెలిపారు.

 

తదుపరి మంత్రి గారి క్యాంప్ ఆఫిస్ నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో అధికారులకు పలుసూచనలు చేసారు. సన్నబియ్యం పంపిణి కోరకు లబ్ధిదారుల ఎంపిక చేసి సిద్ధంగా ఉండాలన్నారు. Led screen ప్రజలు తిలంకించె ప్రాంతాలలో పేట్టాలన్నారు,ప్రజలకు మజ్జిగ, చల్లని త్రాగునీరు అందుబాటులో ఉండాలన్నారు.పోలీసు బందోబస్త్,ట్రాఫిక్ నియంత్రణ చాల ముఖ్యమన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజలకి కేజీకి 40 రూపాయల చొప్పున కొని దొడ్డు బియ్యం పంపిణి చేయటం వల్ల 8 వేల కోట్లు ఖర్చుపెట్టిన వాటిని ప్రజలు తినకుండా దుర్వినియోగం అయ్యాయని అందుకే ముఖ్యమంత్రి తో కలిసి మాట్లాడి సన్న బియ్యం పంపిణి చేస్తే తింటారని అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.సన్నబియ్యం పంపిణి వల్ల తెలంగాణ రాష్ట్రములో 84 శాతం మందికి లబ్ది చేకూరుతుందని ప్రతి ఒక్కరు సన్నబియ్యం తింటారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజలు అధికసంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎస్పి నరసింహ,అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, వేణుమాధవరావు,డి ఎస్ ఓ రాజేశ్వర్, డి ఎం ప్రసాద్, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా

Harish Hs

గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Harish Hs

“గత ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు – గంగుల కమలాకర్‌ను అబ్దుల్ రెహమాన్ సూటిగా ప్రశ్నించారు”

TNR NEWS

అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు

TNR NEWS

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా

Harish Hs

సన్రైజ్ వెస్ట్ జోన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం

Harish Hs