మునగాలమండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న దార శ్రీనివాస్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.సోమవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామపం చాయతీ కార్యదర్శి జావీద్ ఆహ్వానం మేరకు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. భోజనం అనంతరం బాత్రూమ్కు వెళ్లిన శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడంతో పంచాయతీ కార్యదర్శులు హుటాహుటిన కారులో కోదాడకు తరలించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ స్వస్థలం హుజూర్ నగర్ కాగా కోదాడలో స్థిరనివాసం ఉంటున్నారు. ఎంపీఓ శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ డీఓ కె.రమేష్ దీనదయాళ్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు సంతాపం ప్రకటించారు.

previous post
next post