మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్యతో, పాటు మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి యాసంగి సీజన్ లో ముందుగా వరి నాట్లు వేసిన పొలాల్లో, ఇలా కొన్ని కంపనీ లకు చెందిన సన్న గింజ రకాలకు ముందుగానే కంకులు రావడం జరుగుతుందని తెలిపారు.ఈ విధంగా 45 రోజులకే కంకులు రావడం గల కారణాలను కనుగొనడానికి,ఇది విత్తన నాణ్యత లేకపోవడం వలన జరిగిందా? లేక
వాతావరణ పరిస్థితుల వలన జరిగిందా?
అనేది పూర్తి అంచనా కోసం శాస్త్రవేత్తలను రప్పిస్తామని వారు ఆ పంట పొలాలను పరిశీలన చేసిన తర్వాత, వారిచ్చే తుది నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, రైతులు కోలా ఉపేందర్, శివకృష్ణ, మహేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు
