బహుజన సమాజ్ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ నిసాని రామచంద్రమను బీఎస్పీ అధినేత్రి బెహన్ జి మాయావతి నియమించారు. గత నెల 29న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించి ఈ నెల 10వ తేదీన న్యూఢిల్లీలో మాయావతి గారి నివాసంలో ఆమె ప్రకటించారు. నీసాని రామచంద్రం గత 20 సంవత్సరాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుండి పనిచేస్తూ అనేక బాధ్యతలు చేపట్టారు. మానకొండూర్ అసెంబ్లీ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కరీంనగర్ సిద్దిపేట జిల్లాలకు అధ్యక్షులుగా పని చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బహుజన ఉద్యమ సామాజిక రాజకీయ శిక్షణ తరగతులు బోధిస్తూ అమ్ముడుపోని కార్యకర్తలను తయారు చేశారు. కరీంనగర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. పూలే సిద్ధాంతాలను ఈ ప్రాంతంలో పరిచయం చేసిన వ్యక్తి నిసాని రామచంద్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని చిలాపూర్ గ్రామంలో జన్మించిన నిషాని రామచంద్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. కరీంనగర్ జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తూ పార్టీ పలోపేతానికి కృషి చేశారు. తనకు ఈ బాధ్యతల రావడానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యులు సెంట్రల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని మాయావతి నివాసానికి పోయి నీసాని రామచంద్రం కృతజ్ఞతలు తెలిపారు.
