కోదాడ పట్టణంలోని సాయిబాబా థియేటర్ వీధిలో షాప్ నెంబర్ 3 కే శ్రీనివాస్ డీలర్ రేషన్ షాపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఇళ్ల లో ప్రతిరోజు పండగ వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు ఈ పథకం ప్రారంభించారనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అంబడి కర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు వేలాద్రి, మైస రమేష్, కందర బోయిన వీర స్వామి, డీలర్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు……….

previous post
next post