మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వెళ్లి క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని,విద్యార్థులకు మెమోంటోలను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.