కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, సన్న వడ్లకు బోనస్ పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రికి,మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు, సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రైతుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనమే సన్న వడ్లకు బోనస్ ప్రకటించి రైతుల ఖాతాలో డబ్బులు వేయడమేనని, దీంతో రైతుల జీవితాల్లో ఎంతో మార్పు రానుందని సురేందర్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రతిపక్షాలు అసత్య ప్రకటనలు చేసి అభాసు పాలు కావద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.