పిఠాపురం : ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఒకటి శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం పట్ల నిరసనగా పిఠాపురం రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5న పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రిజర్వేషన్ రాష్ట్రంలో అత్యధికంగా వున్న రెల్లి ఉపకులాలకు ఒకటి శాతం రిజర్వేషన్ ఏమాత్రం సరిపోదన్నారు. 2011 కంటే రెల్లి కులస్తులు గణనీయంగా పెరిగారని చెప్పారు. రెల్లి దాని ఉప కులాలు 12 వరకూ వున్నాయని, ఇప్పుడు కొత్తగా బుడగా జంగం కులాన్ని ఈ ఒకటీశాతంలో చేర్చడం బాధాకరంగా వుందన్నారు. తాజా జనాభా సంఖ్య ప్రాతిపదికన రెల్లి ఉపకులాలకు రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని, బేడా బుడ్గా జంగాలను వేరే గ్రూప్ లో చేర్చాలని వారు డిమాండి చేశారు. జస్టీస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ను అనుసరించి రెల్లి కులస్తులు దళితుల్లోనే అత్యంత దయనీయ స్థితిలో వున్నారని గుర్తించి వారిని ప్రత్యేక గ్రూప్ గా రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. తమ నిరసన తెలపడానికి 5 వ తేదీ ఉదయం పది గంటలకు పిఠాపురం అగ్రహారం పశువుల సంత నుంచి వేలాదిగా ర్యాలీ ప్రారంభించి తహసీల్దార్ కార్యాలయం వరకూ కొనసాగిస్తామన్నారు.

previous post