Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

  • శాసన మండలి సభ్యుడు నాగబాబు చేతుల మీదుగా అందజేత 

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం పరిధిలో వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత సహకరించని స్థితిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 45 మందికి రూ.40 లక్షల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాగా పిఠాపురం పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. సాయం కోసం దరఖాస్తులు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన సాయం అందే ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు.

 

Related posts

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు 6 సంవత్సరాల నిత్యశ్రీ ఎంపిక

Dr Suneelkumar Yandra

శ్రీవారి వకుళమాత

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

TNR NEWS

బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ వర్గీకరణలో చేర్చడం అభినందనీయం

Dr Suneelkumar Yandra

రాజ్యాధికారమే మాస్టర్ కి, అంబేద్కర్ మార్గంలో ముందుకు సాగాలి

Dr Suneelkumar Yandra

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం