- శాసన మండలి సభ్యుడు నాగబాబు చేతుల మీదుగా అందజేత
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం పరిధిలో వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత సహకరించని స్థితిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 45 మందికి రూ.40 లక్షల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాగా పిఠాపురం పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. సాయం కోసం దరఖాస్తులు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన సాయం అందే ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు.