మంగళగిరి : మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (శివాలయం) ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా భోగి కోటేశ్వరరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా సుఖమంచి గిరిబాబు, తిరుమల శెట్టి మురళీకృష్ణ, ఇసుకపల్లి వెంకట లలిత, ఉడత లావణ్య, జంజనం వెంకట సుబ్బారావు, చిలకా బసవమ్మ, బాపనపల్లి వాసు, ఆకునూరి కరుణలు నియమితులైన సందర్భంగా మంగళవారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఎపిఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, డైరెక్టర్లుగా నియమితులైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధిలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.