కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు సిపిఐ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు లు అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పట్టణములో ప్రధాన రహదారిపై గ్యాస్ బండలతో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గ్యాస్ ధరలు గ్యాస్ బండకు 50 రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం కార్పోరేట్లకు వత్తాసు పలుకుతూ ప్రజలపై భారాలు మోపుతూ ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ, షేక్ లతీఫ్, మాతంగి ప్రసాద్, కొండ కోటేశ్వరరావు ,ఎస్ కే రేహమాన్, రాయపూడి కాటమరాజు. అల్వాల గురవయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు