కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ పిలుపుమేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు రెండు నియోజకవర్గాల సమన్వయకర్తగా కోదాడ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ముత్తినేని వీరయ్య జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు తో కలిసి మాట్లాడారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నారని రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చిందని ముఖ్యంగా మహిళల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని గత పది ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తిరిగి బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అరాచకాలను ప్రజలందరికీ వివరించాలన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, గంధం యాదగిరి, షాబుద్దీన్, కోటిరెడ్డి, కాంపాటి శ్రీను, మదర్, వెంకటేశ్వర్లు, శ్రీను, రాజు, బాబా, లక్ష్మీనారాయణ, నిరంజన్, సైదిబాబు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు………