మంగళగిరి : తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలసి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ – అన్నాడీఎంకే కూటమికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, కూటమి తర పున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎడపాడి కె.పళనిస్వామి పేరును ప్రకటించారు. పాలనాపరమైన అనుభవం ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తామని తమిళనాడు ప్రజలకు కూటమి తెలియచేసింది. పళనిస్వామికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఎన్.డి.ఎ. పాలన విధానాలు ద్వారా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ఎన్.డి.ఏ. కూటమి ద్వారా కచ్చితంగా మేలు చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

previous post
next post