Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వైభవముగా చండీ హోమము

పిఠాపురం : శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతీ పౌర్ణమికి జరుగుచున్న చండీహోమంలో శనివారం రూ.1,116/- చెల్లించి, ఆరు జంటలు, రూ. 200/- చెల్లించి తొమ్మిది జంటలు పాల్గొన్నారు. సమస్త పూజా ద్రవ్యములను దేవస్థానమువారే సమకూర్చడముతో పాటు, కండువా, రవికెలగుడ్డలను అంద జేశారు. ఈ చండీ హోమం వలన ధన, ధాన్య, ఐశ్వర్య, విజయ, కీర్తి, సంతోష సిద్ది, మరియు సర్వ బాధల నుండి విముక్తి కొరకు ఈ హోమము శ్రేయోదాయకమని, ప్రతి ఒక్కరూ ప్రతి పౌర్ణమికి చండీ హోమము నందు పాల్గొని అమ్మవారి శుభాశీస్సులు పొందాలని  పండితులు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ, అల్లంరాజు చంద్రమౌళి కోరారు. ఈ చండీ హోమం నందు పాల్గొన్న అందరికీ దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ నుండి  అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు.

Related posts

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక దృష్టి ఉంటుంది

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

TNR NEWS

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

TNR NEWS

నిరుపేదలకు గీసాల చారిటబుల్ సొసైటీ నిత్యవసర సరుకులు అందజేత

Dr Suneelkumar Yandra

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సుదూరప్రాంతాల నుండి ఆవిర్భవసభకు వచ్చేవారికి జ్యోతుల భోజనాల ఏర్పాటు

Dr Suneelkumar Yandra