Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలి

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ఐపీఎల్ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని అన్నారు.బెట్టింగ్ లకు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారన్నారు. సులభంగా అధిక నగదును అర్జించవచ్చునని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతారన్నారు. ఒక్కసారి బెట్టింగ్‌లకు అలవాటు పడితే వాటి నుంచి బయటకు రావడం కష్టతరం అవుతుందన్నారు. బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్ట పోవడం జరుగుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారన్నారు.బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అధ:పాతాళానికి నెట్టేస్తుంది. యువత దానికి బలికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Related posts

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

టిఎస్ జెఆర్జేసి లో కోదాడ విద్యార్థికి స్టేట్ 4వ ర్యాంకు

TNR NEWS

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS