December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

దారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి.

 

వికారాబాద్ జిల్లా ధారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏ ఎమ్ సీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ .

ధారూర్ మండల కేంద్రంలోని శుభం కన్వెన్షన్ లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఎమ్ సీ చైర్మన్ కొత్తపల్లి విజయ భాస్కర్ రెడ్డి, ఏఐసీసీ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంతోష్, పీసీసీ జనరల్ సెక్రటరీ రఘువీరారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాన్ సింగ్, అమర్ పటేల్, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు.

ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు.

చైర్మన్ గారి నాయకత్వం లోని పాలకవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్నాను.

రైతులు పొలంలో కష్టపడి పంటలు పండిస్తేనే మనందరం అన్నం తింటున్నాం. కోటీశ్వరుడు అయినా పేదవాడు అయినా అందరికీ అన్నం పెట్టేది రైతే.

కంప్యూటర్లు, కార్లు ఆకలి తీర్చవు, రైతు పండించిన పంటలే మన కడుపు నింపేది.

అలాంటి రైతుకు సేవ చేసే అదృష్టం వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు దక్కింది.

కష్టపడి పంట పండించిన రైతుకు వ్యవసాయ మార్కెట్ లో ఎలాంటి కష్టం లేకుండా ధాన్యాన్ని అమ్ముకుని ఆనందంగా ఇంటికి వెళ్ళే విదంగా ఇక్కడ సౌకర్యాలు ఉండాలి.

తద్వారా మీకు, ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. రైతుల సంతోషమే మనందరికీ కావల్సింది.

ఇది రైతు ప్రభుత్వం, రైతుల మేలుకోరే ప్రభుత్వం.

ఈ ఏడాది వర్షాలు మంచిగా కురిసాయి, చెరువులు, ప్రాజెక్టులు అన్ని నిండడంతో వరి సాగు బాగా పెరిగింది.

దేశంలో ఇప్పటి వరకు ఎప్పుడూ పండని విదంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో 67 లక్షల ఎకరాలలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇది రికార్డు.

దొడ్డు రకాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటుగా గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సన్న రకాలకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది మన ప్రజా ప్రభుత్వం.

ధాన్యం కొనుగోలు కోసం 10,547 కోట్లు కేటాయించింది.

రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు, రైతులకు మేలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో అత్యధికంగా నిధులను కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరం లోనే వ్యవసాయానికి 54,280 కోట్లు ఖర్చు చేసింది.

దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విదంగా 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడం జరిగింది.

అర్హులైన మిగిలిన రైతులకు కూడా డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అందుతుంది.

ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. గత ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయలేకపోయింది, అది మాటల ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం.

ఒక్క సంవత్సరం లోనే వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్తు కోసం 10,444 కోట్ల సబ్సిడీ ఇచ్చింది.

గత ప్రభుత్వం భూస్వాములకు కూడా రైతుబంధు ఇచ్చింది.

అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఉద్యేశంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది, త్వరలోనే రిపోర్టు వస్తుంది. అర్హులైన అందరికీ రైతు భరోసా అందుతుంది.

ఎవ్వరు బాధపడనక్కర్లేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం ఇది.

రైతుల కోరిక మేరకే లగచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని ఉపసంహరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి భేషజాలకు పోకుండా రైతులను గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతులను గౌరవించిన ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను.

గత ప్రభుత్వంలో రైతులు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా సంవత్సరాల పాటు నిరాహారదీక్షలు, ఆందోళనలు చేశారు. అయినా రైతులను ఒప్పించకుండా అర్ధరాత్రి వేలమంది పోలీసులతో గ్రామాలను ఖాళీ చేయించి లారీలలో బలవంతంగా తరలించారు. గత ప్రభుత్వం రైతుల విషయంలో అంతటి కఠినంగా వ్యవహరించింది.

ఫార్మా విలేజ్ ఏర్పాటుపై ప్రతిపక్షాలు గాయ్ గాయ్ చేయడం రాజకీయం తప్ప ప్రజల మేలు కోరి కాదు. ఫార్మా విలేజ్ ఏర్పాటుతో భూములకు మంచి రేట్లు వస్తాయి, యువకులకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్యేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మారుమూల ప్రాంతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలనుకున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కాబోతోంది. పరిశ్రమలు వస్తాయి, ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి కలుగుతుంది.

ప్రజా ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల మేలు కోసమే, అభివృద్ధిని అడ్డుకునే వారి మాటలను నమ్మవద్దు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం.

ఇప్పటికే మహిళలకు RTC బస్సులలో ఉచిత ప్రయాణం, 500 లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అమలవుతున్నాయి.

మిగిలిన హామీలను అమలు చేద్దాం అంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోవడం లేదు.

గత ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా అప్పులు చేసింది. ఏ సంక్షేమ కార్యక్రమం చేద్దామన్నా అప్పులు, వడ్డీలే అడ్డంపడ్తున్నాయి.

గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం సృషించింది. ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది, జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉండేది.

ప్రజా ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు దీనిని సరిదిద్దడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం వస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 18000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే అందులో 6500 కోట్లు జీతభత్యాలకు పోతుంది. మరో 6,500 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ వాయిదాలకు చెల్లించాల్సి వస్తుంది. ఆ అప్పులు లేకపోతే హామీలు అన్ని అమలు అయ్యేవి. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి.

అయినప్పటికీ మాట ఇచ్చాం కాబట్టి హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు కష్టపడుతున్నారు. త్వరలోనే మిగిలిన హామీలు కూడా అమలు అవుతాయి.

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రైతులకు ఎక్కువగా మేలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.

గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల,

రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేయకుండా వికారాబాద్ జిల్లాకు సాగునీరు రాకుండా చేసింది. BRS నాయకులు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారు.

ఇప్పుడు రైతుల ప్రభుత్వం వచ్చింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ జిల్లాకు సాగునీరు అందిస్తాను.

వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను.

గత పదేళ్లుగా నాతో ఉన్న వారందరికీ న్యాయం చేస్తాను.

ధారూర్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయిస్తాను.

ఎన్నికల సమయంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చిన హామీలను ప్రతి గడపకు చేరుస్తానని మాట ఇస్తున్నాను.

Related posts

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి*

TNR NEWS

అనంతగిరి అర్బన్ పార్క్ ను శంకుస్థాపన చేసిన స్పీకర్

TNR NEWS

*ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

Harish Hs

20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు

TNR NEWS

మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం

TNR NEWS