సమాచార హక్కు చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్ తెలిపారు. సోమవారం కోదాడ పట్టణంలోని వారి కార్యాలయంలో సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా జాయింట్ సెక్రటరీగా షేక్ అమీర్ పాషా ను నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడు చేతిలో సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం లాంటిదని సామాన్యుడికి అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. సమాచార హక్కు రక్షణ చట్టం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా కార్యకర్తలు పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూసి అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు……

previous post