Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నేరాలకు పాల్పడితే జైలు తప్పదు, కుటుంబంలో ఒక్కరూ జైలుకు వెళితే కుటుంభం చిన్నాభిన్నం అవుతుంది.

సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని బుధవారం రాత్రి మునగాల మండల పోలీసుల ఆధ్వర్యంలో నరసింహులగూడెం గ్రామంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై చట్టాల గురించి ప్రజలకు వివరించారు. చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తుల నడవడికను చట్ట పరిధిలో మార్పు తేవడం కోసం గ్రామాలలో ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగానే పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఈరోజు నరసింహులగూడెంలో నిర్వహించడం జరిగింది తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడితే కేసులు నమోదయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కుటుంబ పెద్ద జైలు పాలైతే కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని గుర్తు చేశారు. కష్టాన్ని నముకోవాలి, కష్టపడితే మంచి ఫలితం, విజయం వస్తుంది అన్నారు. క్షణికావేశంతోను మద్యం మత్తులో ఏవైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడే తత్వాన్ని మార్చుకోవాలని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని కోరారు. మద్యం మత్తుల వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాల పాడిన పడి మృత్యువాత పడతారని అన్నారు. ఆరుగాలం కష్టపడి సంపాదించిన సొమ్మును అత్యాశకు పోయి ఆన్లైన్ ద్వారా బెట్టింగులకు పాల్పడి లేదా సైబర్ మోసగాళ్ల బారిన పడి ఆర్థిక నష్టాల బారిన పడద్దని కోరారు. గ్రామంలో యువత కష్టపడి చదువుకోవాలని చదివే మంచి మార్గమని అన్నారు, బాగా చదువుకుని గ్రామం నుండి ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామానికి మంచి పేరు తేవాలని గుర్తు చేశారు. రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మునగాల మండల కేంద్రానికి చెందిన మా కానిస్టేబుల్ రాంబాబు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధ కలిగించింది, ఎవ్వరూ కూడా అజగ్రత్తతో రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దు అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారు గ్రామాలకు వస్తారు, గుర్తించాలి, కంపెనీ లేబుల్ ఉన్న మంచి గుర్తింపు కలిగిన విత్తనాలు కొనాలి అన్నారు. మన పిల్లలు డ్రగ్స్, గంజాయి బారిన పడి భవిష్యత్తు కోల్పోతున్నారు మన సమాజం నుండి గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలించాలి అన్నారు. మా సిబ్బంది రాత్రి పగలు విధులు నిర్వర్తిస్తూ ప్రజల రక్షణ కోసం ఉన్నారు అని గుర్తించాలి, తనిఖీలు జరిమానాలు ప్రజల రక్షణ కోసం అన్నారు. ఒక్క పోలీసు సుమారు 300 మందికి రక్షణ కల్పిస్తున్నారు అన్నారు.

 

ముందుగా గ్రామస్తులు జిల్లా ఎస్పీ గారికి కోలాటం ఆటపాటలతో స్వాగతం తెలిపారు, సామాజిక అంశాల గురించి పోలీసు కళాబృందం వారు నాటక ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పించారు. 

 

గ్రామం నుండి ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుకుని ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలు నందు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు సన్మానం చేశారు. 

 

ఈ కార్యక్రమం నందు మునగాల సర్కిల్స్ CI రామకృష్ణారెడ్డి గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, స్థానిక SI ప్రవీణ్ కుమార్, గ్రామ పెద్దలు, గ్రామ పౌరులు పాల్గొన్నారు.

Related posts

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత పై సమీక్ష.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

Harish Hs

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

TNR NEWS

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs