Tnrnews.in
తెలంగాణరాజకీయం

కడుపు మండిన రైతు,, ధాన్యంలోడుతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా

హుజూర్ నగర్ లో వడ్లు కొనుగోలు చేయట్లేదు అంటూ కడుపు మండిన రైతు రోడ్డుకి అడ్డంగా వడ్ల లోడు తో ఉన్న ట్రాక్టర్ ను అడ్డం పెట్టి నిరసన వ్యక్తం..

వడ్లు కొనే పరిస్థితి లేదంటూ,, వడ్లు మేము కోనం మాకొద్దు అంటున్న మిల్లర్లు…

హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పడుతున్న రైతులు,,,

500 బోనస్ అంటూ బోనస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం,, ఇప్పుడు కనీసం వడ్లు కూడా కొనే దిక్కు లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

గతంలో అయితే ధాన్యం కొనుగోలు సెంటర్లో పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, కనీసం ఇప్పుడు మద్దతు ధర దేవుడు ఎరుగు కానీ ఉన్న వడ్లను కొనుగోలు చేస్తే చాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు..

గతంలో సీఎం కేసీఆర్ ఉండగా 2700 వందల రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు కనీసం 2000 కూడా పలకడం లేదని అన్నారు..

మిల్లర్లంతా సిండికేట్ అయి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొర్రలు పెడుతున్నారని, ఈ విషయం తెలిసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అందుకే కడుపు మండి రోడ్డుపై దాన్యంలోడుతో ధర్నా చేస్తున్నట్టు తెలిపారు.. రెండు రోజుల నుంచి తిరుగుతున్న కనీసం ధాన్యం ని ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని.. వర్షం వస్తే పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు వద్దనుండి ధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.

TNR NEWS

మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

Harish Hs

TNR NEWS

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS