Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి కొండంత ధీమా

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జీవితభీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రతి కుటుంబానికి కొండంత ధీమ ఉంటుందని డివిజనల్ మేనేజర్ రాజబోయిన భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా, మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామానికి చెందిన బెల్లంకొండ నాగేశ్వర రావు గారు రెండు సంవత్సరముల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 21803/- రూపాయల పాలసీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మండవ నరేష్ డెవలప్మెంట్ ఆఫీసర్ మండవ నాగేశ్వర రావు గారి వద్ద పాలసీ తీసుకోవడం జరిగింది, దురదృష్టిల శాత్తు ఇటీవల అనగా గత సెప్టెంబర్ 10 వ తారీఖు 2024న అనారోగ్య కారణంతో మరణించడంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు వారి యొక్క భార్య అయిన నామిని బెల్లంకొండ కవిత గారికి 4,17,024/- రూపాయల చెక్కును వరంగల్ జోనల్ మేనేజర్ గంగుల సతీష్ కుమార్(DGM) గారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం పాలసీలను కలిగి ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబానికి భరోసాను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ బ్రాంచి మేనేజర్ కుంభం నర్సింహ రావు గారు మరియు బ్రాంచిఎగ్జిక్యూటివ్స్ పనసరరఘు , గోదేశ గౌతమ్, గండమల్ల యల్లయ్య, గుంజ నవీన్, పొనుగోటి వీరాంజనేయులు, బాణుతు వినోద్ , డివోలు సాధె నాగేశ్వర రావు, వేముల రాజు, షేక్ హస్సైన్, చింతల నాగేశ్వర రావు, కన్ని బోయిన నర్సింహారావు, షేక్ యాసిన పాషా, సేల్స్ ఆఫీసర్స్ మునుకుంట్ల నాగయ్య, వీరాచారి, బుర్రి సతీష్ సేల్స్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

Harish Hs

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలి

Harish Hs

గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు

TNR NEWS

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS