Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీ కోట్లను తొలగించాలంటూ పేద చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బడ్డీ కొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షులు షేక్ నయీమ్, గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్యలు అన్నారు. బుధవారం మండపం ఏరియాలోని చిరు వ్యాపారులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు బడ్డీ కోట్ల ను వేసుకొని మున్సిపాలిటీకి పన్నులు కడుతూ ఉపాధి పొందుతున్నారని గతంలో అనేకమంది స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన దురాక్రమణ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారని అన్నారు. డబ్బా కొట్లను తొలగించి పేదల జీవనం మీద పొట్ట కొట్ట వద్దన్నారు. మున్సిపాలిటీ అధికారులు పేద చిరు వ్యాపారులను వేధించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో కర్ల సుందర్ బాబు, షేక్ దస్తగిరి, రాజు, సైదులు, సింహాచలం, రావుఫ్, సైదులు, మౌలానా, మహమ్మద్, అబ్దుల్ రహీం, కృష్ణకుమారి,రాంబాబు,హుస్సేన్ బి, దస్తగిరి, గోపాలకృష్ణ, రాజు, నరహరి, ముస్తఫా, ఆరిఫ్,లక్ష్మీ,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు…

Related posts

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

Harish Hs

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో* 

TNR NEWS