కేంద్ర ప్రభుత్వం మార్చిలో జరిగిన పార్లమెంటు సమావేశల్లో గుట్టు చప్పుడు కాకుండా పెన్షనర్ల చట్ట సవరణ బిల్లును ఆమోదించడం బాధాకరమని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్ల సంఘ కార్యాలయంలో చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను, ప్రయోజనాలను కాలరాసేలా చట్టాన్ని రూపొందించడం దుర్మార్గమన్నారు. వెంటనే పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా ఈనెల 23న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించేందుకు పెన్షనర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లూ రాంబాబు, కోదాడ కార్యదర్శి రఘువర ప్రసాద్, హనుమారెడ్డి,గడ్డ నరసయ్య, సత్తయ్య, రుక్ముద్దీన్, సాంబులు జాన్ షరీఫ్, చిగురుపాటి వరప్రసాద్,చంద్రశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు……….

previous post